calender_icon.png 19 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుజాత నగర్‌లో జలగం పుట్టినరోజు వేడుకలు

18-04-2025 10:11:04 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, జలగం వెంకట్రావు జన్మదిన వేడుకలను సుజాత నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం అభిమానులు సుజాతనగర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్స్, మజ్జిగ స్థానికులకు పంపిణీ చేశారు. అభిమానులు మాట్లాడుతూ... కొత్తగూడెం నియోజవర్గంలో ముఖ్యంగా సుజాతనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన ఘనత ఆయనదేనని ఆయన కృషి వల్లే అభివృద్ధి చెందిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండలం జలగంయువసేన,అభిమానులు,చింతలపూడి జగన్, సయ్యద్ యాకూబ్ అలీ, గూని వీరభద్రరావు,దొంచరపు శ్రీనివాస్,సంగు రాజేష్, సుధాకర్, బానోతు వీరన్న, భీమా, సర్వేస్, చిరంజీవి, ప్రదీప్, సతీష్, తో పాటు పలువురు నాయకులు, పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొని, ఆనందోత్సాహల మధ్య జలగం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో విశేషం.