calender_icon.png 7 October, 2024 | 4:16 AM

బకాయిదారులకు జలమండలి ఛాన్స్

06-10-2024 12:00:00 AM

వన్ టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం

ఈ నెలాఖరు వరకు అమలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : దసారా పండుగకు ముందు జలమండలి విభాగం.. నగరవాసులకు శుభవార్త చెప్పింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నల్లా బకాయిలను చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది.

ఇందులో భాగంగా ‘వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్-2024)’ పథకాన్ని మరోసారి అందు బాటులోకి తీసుకువస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్య దర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించకుండా ఉన్నవారికి ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా నే బకాయిలు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

గతంలో రెండుసార్లు అమలు

జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ ను అమలు చేయాలని జలమండలి ఈ నెల 19న ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. గతంలో కూడా 2016, 2020 సంవ త్సరంలో ఓటీఎస్‌ను అమలు చేశారు. కాగా ఈనెల ఇప్పటికే ప్రారంభమైన ఓటీఎస్ పథకం ఈనెలాఖరు 31వరకు అందుబాటులో ఉంటుందని జలమండలి అధికారు లు తెలిపారు. 

షరతులు వర్తిస్తాయి

వినియోగదారులకు ఓ పక్క శుభవార్త చెబుతూనే మరోపక్క షరతులను విధించింది జలమండలి. నల్లా కనెక్షన్ యాక్టివ్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు ఒకేసారి బిల్లు చెల్లిస్తే ఆలస్య రుసుము, వడ్డీ మాఫీ అవుతాయి. గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు రాబోయే 24నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాల్సి  ఉంటుం ది. బిల్లుల చెల్లింపులో వారు విఫలమైతే ఈ పథకం కింద పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. తమ నల్లా కనెక్షన్, డిస్‌కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదా రులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఇప్పటిదాక పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎవరి పరిధిలో ఎంత?

నల్లాల బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారుల స్థాయిని బట్టి నిర్ణయించారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం మేనేజర్ స్థాయిలో రూ.2వేలు, డీజీఎం పరిధిలో రూ.2001 నుంచి రూ.10వేలు, జీఎం పరిధిలో రూ.10,001 నుంచి రూ.లక్ష వరకు, రూ.లక్షపైగా ఉంటే సీజీఎం పరిధిలో వడ్డీ మాఫీ అధికారం కల్పించారు. 

సద్వినియోగం చేసుకోవాలి..

దీర్ఘకాలికంగా నల్లా బిల్లులు చెల్లించని వారికోసం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపా రు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించి ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలని విజ్ఞప్తి చేశారు.

ఖైరతాబాద్‌లో ఎండీ పర్యటన

జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్-4లోని ఖైరతాబాద్, ఏసీ గార్డ్స్, గవర్నర్ దత్తత తీసుకున్న ఇందిరానగర్ కాలనీలో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శనివారం పర్యటించారు. 90రోజుల ప్రత్యే క ప్రణాళికలో జరుగుతున్ను సివరేజీ, మ్యాన్‌హోల్స్ డీసిల్టింగ్ పనులను ఆయన పరిశీలించారు.

తరచూ వచ్చే సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా టన్నెలింగ్ ద్వారా విస్తరణ పను లు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరే షన్స్-1 విజయ రావు, సీజీఎం ప్రభు, జీఎం, డీజీఎం, మేనేజర్ పాల్గొన్నారు.