19-04-2025 01:22:45 AM
అట్టహాసంగా ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 17( విజయ క్రాంతి)మేడ్చల్ పట్టణంలో పలు వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్సులు పొందకుం డా వ్యాపార, వాణిజ్యలను నిర్వహిస్తున్నాయి. భారీగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుకు యేదేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నాయి. నిబంధనల మేరకు ట్రేడ్ లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేయాల్సి ఉండగా ఆ నిబంధనలు భేకాతర్ చేస్తూ రూపాయలు లక్షల్లో వ్యాపారం చేసుకుంటూ ప బ్బం గడుపుతున్నాయి.
ఇదే అంశంపై దృష్టి సాధించాల్సిన సంబంధిత మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక పట్టణ ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్సులు తీసుకొని వాణిజ్య సంస్థలకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత వ్యాపార సంస్థలకు నోటీసులు అందజేసి చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక మేడ్చల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండదా బడా వ్యాపారస్తులకు మునిసిపల్ అధికారులు నిబంధనలకు సంబంధిత అనుమతులు లేనప్పటికీ పాక్షికంగా వ్యవహరిస్తూనే చిరు వ్యాపారులను మాత్రం ప్రతిదీ తప్పనిసరి అని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ట్రేడ్ లైసెన్స్ లేకుండానే జైత్రా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ
మేడ్చల్ పట్టణంలోని జైత్ర ఆస్పత్రి యాజమాన్యం మున్సిపాలిటీ నుండి ఎలాంటి ట్రేడ్ లైసెన్సు పొందకుండానే వారి వ్యాపార నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇటీవల దీనిని కాంగ్రె స్ నాయకులు ప్రారంభించారు. ఇదే విషయమై మేడ్చ ల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డిని వివరణ కోరగా సదరు ఆసుపత్రికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదని, ఆ యాజమాన్యం అందు కు సంబంధించి ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు.