calender_icon.png 23 January, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపూర్ షెడ్యూల్ పూర్తి

13-08-2024 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్ర స్వర్ణోత్సవాన్ని  వచ్చే నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రం కోసం పనిచేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. ‘ఎన్‌బీకే109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఓ ఇంపార్టెంట్ సీక్వెల్‌కు సంబంధించి జైపూర్‌లో నిర్వహించిన షూటింగ్ పూర్తయిందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. త్వరలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నామని కూడా ఆయన ఆ ట్విట్‌లో పేర్కొన్నారు.