calender_icon.png 23 December, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు జైపూర్ పింక్ పాంథర్స్

21-12-2024 12:55:01 AM

* పీకేఎల్ 11వ సీజన్

పుణే: ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఐదో జట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ 31 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 9, అభిజిత్ 7 పాయింట్లు సాధించారు. బెంగాల్ తరఫున రెయిడర్ ప్రణయ్ 8 పాయింట్లతో మెరిశాడు. 21 మ్యాచ్‌ల్లో 12 విజయాలు సాధించిన జైపూర్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 48 పునేరి పల్టన్‌పై గెలుపొందింది. రెండు వరుస పరాజయాల తర్వాత విజయం సాధించిన టైటాన్స్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ (15 పాయింట్లు), ఆశిష్ నర్వాల్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరిశారు. ఆరో ప్లేఆఫ్స్ కోసం యు ముంబా, టైటాన్స్, పునేరి మధ్య పోటీ నెలకొంది. నేటి మ్యాచ్‌ల్లో పట్నాతో గుజరాత్, ఢిల్లీతో జైపూర్ తలపడనున్నాయి.