- విచారణకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే హాజరు
- ప్రత్యర్థి నేతల ఫోన్లు ట్యాప్ చేయించాండటూ విస్తృతంగా ప్రచారం
- తిరుపతన్నతో కలిసి ఓ కుటుంబ వివాదాన్ని పరిష్కరించా
- ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: జైపాల్ యాదవ్
రంగారెడ్డి, నవంబర్16(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే, బీఆర్‌ఎస్ నేత జైపాల్‌యాదవ్ పేరు తెరపైకి రావడంతో సర్వత్ర చర్చకు దారితీసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు ఇటీవల ప్రచా రం జరిగింది. దీంతో ఈ కేసులో ఎవరెవ రూ ఉన్నారంటూ చర్చ కొనసాగింది. విచారణకు హాజరుకావాలని జైపాల్‌యాదవ్‌కు పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేశారు.
దీంతో శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణాధికారి ఏసీపీ వెంకటగిరి ముందు జైపాల్ యాదవ్ హాజరయ్యారు. విచారణ దాదాపు రెండుగంటల పాటు కొనసాగింది. పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
నియోజకవర్గంలో చర్చ
ఫోన్ ట్యాపింగ్ విచారణలో జైపాల్‌యాదవ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడంతో కల్వకుర్తిలోని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల, వెల్దండ, కల్వకుర్తిలో ఉదయం నుంచి జైపాల్‌యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చుట్టే చర్చ సాగింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తమ ప్రత్యర్థి పార్టీ నేతల కు సంబంధించిన పలు ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేసినట్టు గతంలోనే ఆరోపణలు చేశారు. అప్పటి బీఆర్‌ఎస్ నేతలు వాటిని కొట్టి పారేశారు. తాజాగా ఫోన్ ట్యా పింగ్ వ్యహారంలో జైపాల్‌యాదవ్‌కు పోలీసుల నోటీసులు ఇవ్వడంతో, అప్పుడు ఆరోపణ లు చేసిన వారంతా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై మండిపడుతున్నారు.
గతంలో తా ము చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయం టూ బీఆర్‌ఎస్ నాయకులపై విరుచుకుపడుతున్నారు. మాజీ ఎమ్మె ల్యే చెప్పిన ఇరు కుటుంబాల గొడవకు సం బంధించిన విషయాలు ఏమై ఉండొచ్చని, ఎవరి ఫోన్ నం బర్లు ట్యాపింగ్ చేయించారనే చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఫోన్‌ట్యాపింగ్ విచారణ కొనసాగుతుంది.
ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు : జైపాల్ యాదవ్
విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. అడిషనల్ ఏస్పీ తిరుపతన్నకు తాను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు ట్యాప్ అయ్యాయని, వాటి గురించి వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు గుర్తుచేశారు. రెండు కుటుంబాల మధ్య విభేదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇచ్చినట్టు చెప్పారు.
తాను ఇచ్చిన ఆ ఇద్దరి వ్యక్తులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తిరుపతన్న తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివాదాన్ని ఇద్దరం కలిసి పరిష్కరించామని చెప్పారు.
తాను తిరుపతన్నకు ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ట్యాంపింగ్ చేసినట్లు విచారణ అధికారులు నా ముందు కొన్ని ఆధారాలు పెట్టి వివరణ కోరారని.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.