calender_icon.png 17 January, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివి

17-01-2025 01:08:05 AM

వికారాబాద్, జనవరి- 16: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.  మాజీ కేంద్రమంత్రి, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ శే ఎస్. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా పీవీఎన్ ఆర్  మార్గ్ లోని స్పూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి సమాధి వద్ద స్పీకర్  పూలతో నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అభివృద్ధి సాధించడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి ఉన్న సమయంలో వికారాబాద్ ను సాటిలైట్ సిటీగా ప్రకటించినట్లు తెలిపారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం బాధాకరం అన్నారు.