సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఎన్సీఈఆర్టీకి లేఖ రాస్తా: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 16 (విజయ క్రాంతి) : నిరంతరం విలువల కోసం పరితపించే మెన్నతమైన వ్యక్తి దివంగత నేత జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని జెపిఎన్సి కళాశాలలో సూదిని జయపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకలను నిర్వహించి, స్ఫూర్తి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లా డుతూ జైపాల్ రెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపు స్తకాల్లో ఉంచేందుకుగాను సీఎం దష్టికి తీసుకుపోవడంతోపాటు ఎన్సీఈఆర్టీకి లేఖ వ్రాస్తానని స్పష్టం చేశారు.
దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గానే కాకుండా తెలంగా ణ ప్రజల ఆకాంక్ష కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలకపాత్ర పోషించిన మహబూబ్ నగర్ మట్టి బిడ్డ అని ఆయన చెప్పారు.
మచ్చలేని వ్యక్తిత్వం అద్భుతమైన వాగ్ధాటి , ఎవరితోనైనా కలిసిపోయే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ కాలంలో మన మధ్యలో ఉండడం మన అదష్టం అన్నారు. అనేక అభివద్ధి పనులు చేసినప్పటికీ, గొప్పగా చెప్పుకోకపోవడం వారి సుగుణాలు అని, వారు చేసిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ర్టం అని, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం వారు చేసిన కషిని ఎప్పటికీ మర్చిపోరాదని, తెలంగాణ ప్రజలు ఎప్పటి కీ జైపాల్‌రెడ్డిని గుర్తించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
అనేక పర్యాయా లు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైన అభ్యంతరకరమైన భాష లేకుండా సున్నితం గా చెప్పడం జైపాల్ రెడ్డి కే చెల్లిందని, కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివద్ధి శాఖ మంత్రి గా, పెట్రోలియం శాఖ మంత్రి గా, పనిచేసినా ఎక్కడా అవినీతికి తావులేకుండా స్వచ్చమైన రాజకీయ నాయకుడిగా జైపాల్ రెడ్డి జీవించారని అన్నారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి స్పూర్తి పురస్కారం 2025 ను దుప్పల్లి శ్రీరాములు కు, వరకవుల నరహరి రాజు కు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేపీఎన్ సీఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, మైనారిటీ ఫైనా న్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, కె యాదవ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ, వి.మనోహర్ రెడ్డి, కేవిఎన్‌ఆర్, బలగం ఫేం మధు, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.