సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధ నలో జైపాల్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని, ఆయన పోరాటాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం సీఎం ఢిల్లీలో ముందస్తుగా జైపాల్‌రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను జైపాల్‌రెడ్డి నా డు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిశ్శబ్ద సైనికుడిలా పని చేశారని కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసి స్వరాష్ట్ర కల సాధనకు బాటలు వేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని మంత్రి మండలి తీర్మానం చేసిందని స్పష్టం చేశారు.
నేడు జైపాల్‌రెడ్డి జయంతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (విజయక్రాంతి): హైదరాబా ద్‌లోని హుస్సేన్‌సాగర్ పీవీ నర్సింహారావు మార్గ్ స్ఫూర్తి స్థల్ వద్ద గురువారం రాష్ట్రప్రభుత్వం అధికారికంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు పలువురు ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు.