calender_icon.png 10 January, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు భేష్

07-01-2025 12:24:14 AM

  1. నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సైతం స్వాగతించాలి
  2. సీఎం రేవంత్ బంధుప్రీతితోనే పేరు పెట్టారనడం సరికాదు..
  3. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నామకరణం అభినందనీయమని, ప్రతిపక్షా లు నేతలు సైతం ఈ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలని శాసన మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీలోని శాసనమండలి కార్యా లయంలో సోమవారం ఆయన మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు.

సీఎం రేవంత్‌రెడ్డి బంధుప్రీతితో ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెడుతున్నార ని, కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర ఎంతో ఉందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికపరమైన సమస్య లు, సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు.

అయినప్పటికీ రైతాంగాన్ని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో రైతుభరోసాను అమలు చేయనున్నదని స్పష్టంచేశారు. గతంలో నిర్లక్ష్యానికి ప్రాజెక్టులు ఎస్‌ఎల్‌బీసీ, డిండి, ఉద య సముద్రం ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం పని చేస్తున్నదన్నా రు.

ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ అభీష్టానికి అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న రాష్ట్రప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు.