రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్’ చిత్రం ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సీక్వెల్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి పర్వదినం ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను ప్రకటించనున్నారని అర్థమవుతోంది.
రజనీకాంత్ కొత్త సినిమా విషయమై ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేసింది. సంక్రాంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.
ఈ టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను చూసిన రజనీ అభిమానులు అది ‘జైలర్ 2’ గురించే అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ సినిమా కోసం పనిచేస్తున్నారు.