రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది జైలర్. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి నటులతో కలిసి హీరోయిజాన్ని బ్యాలెన్స్ చేసే కామన్ మ్యాన్‌గా నటించాడు. కొన్ని ఎపిసోడ్స్‌లో ఈ నటులు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లారు. మేజర్ పార్ట్స్‌ను ఇతర నటీనటులకు ఇవ్వడానికి ఏ నటుడికైనా ధైర్యం కావాలి. అయితే ఇది జైలర్‌కు బాగా వర్కవుట్ అయ్యింది. రజినీకాంత్ తన తదుపరి చిత్రం కూలీతో కూడా అదే పునరావృతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవి అతిథి పాత్రలేనా లేక ప్రముఖ పాత్రలేనా అనేది తెలియరాలేదు. కానీ రజినీకాంత్ మాత్రం జైలర్ వ్యూహాన్ని పక్కాగా రిపీట్ చేస్తున్నారు. కూలీలో రజినీకాంత్ తో పాటు పలువురు నటులు కనిపించనుండటం సినిమాకు పెద్ద అడ్వాంటేజ్. గోల్ స్మగ్లింగ్ మాఫియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కూలీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.