హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే కేసులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఈవో మనోహర్‌రెడ్డికి హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ. ౨ వేల జరిమానా విధించింది. కరోనా సమయంలో ఆలయానికి చెందిన దుకాణాల లీజు కాలాన్ని జులై 1 నుంచి నవంబర్ వరకు పొడిగించాలని జూన్ 13న హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని అమలు చేయలే దంటూ షాపు లీజుదారుడు రాకేశ్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశాడు. విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పైవిధంగా తీర్పు వెలువరించారు.