11-02-2025 10:48:51 PM
భద్రాచలం (విజయక్రాంతి): గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు భద్రాచలం జ్యుడిషియల్ కోర్టు జడ్జి శివ నాయక్ రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, సర్పంచ్ గా చందు నాయక్ ఉన్న సమయంలో రూ.23 లక్షల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో 2013 లో కేసు నమోదు అయ్యింది. భద్రాచలం జ్యుడిషియల్ కోర్టులో విచారణ అనంతరం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వాస్తవమే అని భావించిన జడ్జి వి. శివ నాయక్ మంగళవారం దోషులు ఇద్దరికీ రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించారు.