calender_icon.png 31 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో జైలుకు నిప్పు

20-07-2024 12:05:00 AM

  • వందలమంది ఖైదీలు పరార్

అల్లరల్లో 105కి చేరిన మృతులు

ఢాకా, జూలై 19: బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చుతున్నది. కనిపించిన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్య తిరేకంగా, అనుకూలంగా పోరాడుతున్న రెం డు వర్గాల విద్యార్థుల మధ్య ఏర్పడిన ఘర్షణ దేశంలో తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం యూనివర్సిటీలన్నింటినీ మూసివేసినప్పటికీ విద్యార్థులు వెనక్కు తగ్గ టం లేదు. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 105 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. శుక్రవారం ఆందోళనకారులు నర్సింగ్డి జిల్లాలో ఓ జైలుకు నిప్పు పెట్టారు. జైలును బద్దలు కొట్టి అందులో ఉన్న వందలమంది ఖైదీలను విడుదల చేశారు. ఎంతమంది ఖైదీలు తప్పించుకొన్నారో లెక్క తెలియదని పోలీసులు తెలి పారు. అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వ ం దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారి వారసుల కు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిని ఎత్తివేయాలని విద్యార్థులు ఆందోళన చే స్తున్నారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన రెండు రైళ్లను శుక్రవారం రద్దుచేసింది. 

300 మంది భారత విద్యార్థులు వెనక్కి.. 

బంగ్లాదేశ్ నుంచి ఇప్పటి వరకు ౩౦౦ మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చారు.  ప్రాణాలు అరచేతిలో పె ట్టుకొని వస్తున్న భారత విద్యార్థులను బీఎస్‌ఎఫ్ కాపాడుతోంది. తిరిగి వస్తున్న వారిలో అనేకం ఉత్తరాది విద్యార్థులే కావడం గమనార్హం. మేఘాలయ, త్రిపుర సరిహద్దుల నుంచి అనేక మంది వస్తున్నారు. ౨౫౦౦ మందికి పైగా విద్యార్థులు గాయపడ్డట్లు తెలుస్తోంది.