calender_icon.png 25 October, 2024 | 5:03 AM

జనం కోసం జైలుకెళ్తా

25-10-2024 02:08:00 AM

జుమ్లా పీఎం.. హౌలా సీఎం

  1. హామీల అమలుపై నిలదీస్తే కేసులా?  
  2. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై ఎన్ని కేసులు పెట్టాలి? 
  3. పోలీసులు, అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తం
  4. బీఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి.
  5. ఆదిలాబాద్ నుంచే ప్రభుతంపై పోరు  
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆదిలాబాద్/ నిర్మల్ , అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రజల కోసం ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెడుతున్నారని, జనం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికైనా సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం న్యాయం కోసం పనిచేయాలని సూచించారు.

అధికారం ఎవరికీ శాశతం కాదన్నారు. మితిమీరి ప్రవర్తించిన పోలీసులు, అధికారుల  పేర్లను పార్టీ శ్రేణులు రాసి ఉంచాలని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆధర్యంలో ఆదిలాబా ద్‌లో చేపట్టిన రైతు పోరుబాట సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో జుమ్లా పీఎం, రాష్ర్టంలో హౌలా సీఎంల  ప్రభుతాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూ దొందేనని, ఈ రెండు ప్రభుతాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ధజమెత్తారు. ఉద్యమాల పురిటిగడ్డ కుమ్రం భీమ్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుతంపై ఆదిలాబాద్ నుంచే పోరు మొదలయ్యిందని ఆయన అన్నారు.

మాజీ మంత్రి జోగు రామన్న చేపట్టిన పోరుబాటనే ఇక ఉద్యమబాటగా తీసుకుని ముందుకు పోతామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  కేసీఆర్ నేతృతంలో   చంద్రబాబు,  వైఎస్సార్‌లనే ఎదుర్కొన్నామని, చిట్టి నాయకుడు రేవంత్ రెడ్డి తమకో లెక్కనా అని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలతో రాష్ర్టంలో కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.

ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుతాన్ని నిలదీస్తే తమపై కేసులు పెడుతున్నారని, ఇలా మోసపూరిత వాగ్ధానాలు చేసిన 420 సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ర్ట సమితి కాదని భారత రైతు సమితి అని అభివర్ణించారు. రాష్ర్టంలో అడుగడుగునా అశాంతి, అభద్రత నెలకొందని, డిచ్ పల్లిలో పోలీసు కుటుంబీకులు ధర్నాలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. 

భారత రైతు సమితిగా పోరాటాలు..

తెలంగాణ ఉద్యమ సమయంలో భోరజ్ చెక్ పోస్ట్ వద్ద నిరహించిన ధర్నా రోజులను కేటీఆర్ గుర్తుకు తెచ్చారు. ప్రస్తుతం అదే స్ఫూర్తితో అసమర్థ ప్రభుతంపై పోరాడతామని పిలుపునిచ్చారు. అదానీ వంటి కార్పొరేట్లకు ప్రభుత ఆస్తులను దారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసీఆర్ ఉం టే వారి ఆటలు సాగేవి కాదన్నారు.

ఆదిలాబా ద్ లో పండించే పత్తికి గుజరాత్ కంటే తక్కువ ధర చెల్లించడం భావ్యం కాదని, పత్తి ధరపై ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ భారత రైతు సమితిగా పోరాటాలు చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. 

కొత్త ఉద్యోగాలు కాదు ఉన్నవి తీసేస్తున్నారు 

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రేవంత్ పాలనలో రెండులక్షల ఉద్యోగాలు ఇచ్చుడుకంటే ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 165 మంది ఏఈవోలను, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ బీఆర్‌ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని, ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

తిరస్కరించిన వారికి పాలన అప్పగించడమేనా..

ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పగించడమేనా అంటూ కేటీఆర్ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎనుకున్న ప్రతినిధులు లేకుండా, ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా నడపడం శోచనీయమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం, పంట కొనుగోలు చేయడం చేతగాదన్నారు. రాష్ట్రంలో రైతు గోడు వినే నాథుడే లేడని, సీఎం, మంత్రులు ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారని మండిపడ్డారు. అన్నదాతల అవస్థలను తీర్చడానికి తీరికలేదని, ఢిల్లీ టూర్లు, విదేశీ యాత్రలేనా పాలనంటూ ప్రశ్నించారు.

మోదీది వివక్ష పాలనే

  మోదీ సర్కార్‌ది వివక్ష పాలనే అని  కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆదిలాబాదు పర్యటన ముగించుకొని హైదరాబాదు వెళ్తున్న సందర్భంగా నిర్మల్‌లో కార్యకర్తతో మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రాంకిషన్ రెడ్డి నివాసంలో  విలేకరులతో మాట్లాడారు. రైతులు తమ హక్కుల కోసం కొట్లాడుతుంటే మోదీ రైతులపై కాల్పులు జరిపించారని ఆరోపించారు. 

పత్తిరైతులకు ఒకే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం విభజించు పాలించు అనే ధోరణిలో పోతుందని అన్నారు. పత్తి  రైతులకు గుజరాత్‌లో రూ, 8,800 ధర చెల్లిస్తే తెలంగాణాలో  రూ. 7,225  మాత్రమే చెల్లింస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలంగాణాపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు.

ఆలాబాదులో సీసీఐ పునరుద్ధరణ ఏమైందని ప్రశ్నించారు. మోదీ పాలనపై  తిరుగుమబాటు ప్రారంభం ఆయ్యిందన్నారు.  రేవంత్ రెడ్డి  మూసీ సుందరీకరణ పేరుతో కొత్త నాటకం అడుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారును వదిలి  పెట్టబోమన్నారు. దిలావర్ పూర్‌లో ఇథానాల్ పరిశ్రమను వెంటనే ఆపాలని లేకుంటే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

తాము పరిశ్రమకు ఊరికి దూరంగా అనుమతి ఇస్తే కాంగ్రెస్ నేతలు దాన్ని మార్చి ఊరికి దగ్గర అనుమతి ఇచ్చారని ఆరోపించారు. జిల్లాలో ఎన్నో పదవులు అనుభవించిన కొందరు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారని, వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోమని తెలిపారు 2028లో  తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలో రానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సమావేశంలో ఎమ్మెల్యేలు  పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్,అనిల్ జాదవ్, మాజీ ఎమ్మల్యేలు బాల్క సుమన్, విజయలక్ష్మీ, లోలం శ్యాంసుందర్, రమాదేవి, జాన్సన్ నాయక్ ,కిరణ్‌కారే, సుభాశ్‌రావు, చరుగోండ  రాము, భూషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజలకు అండగా ఉంటాం

అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత విధానాలపై తీవ్రస్థాయిలో ధజమెత్తారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదంటూ స్పష్టం చేశారు. రైతాంగానికి, సామాన్య ప్రజానికానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, కౌశిక్ రెడ్డి, కలకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఉమ్మడి జిల్లా నేతలు, నాయకులు పాల్గొన్నారు.