calender_icon.png 24 January, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు

24-01-2025 12:25:02 AM

జగిత్యాల అర్బన్, జనవరి 23 (విజయక్రాంతి): బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రాయికల్ తాసిల్దార్ ఎండి ఖయ్యూం జైలు శిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనరసయ్య  గతంలో ఎక్సైజ్ నేరంలో పట్టుబడి ఒక లక్ష రపాయలకు బైండోవర్ చేయగా, ఆ బైండోవర్ను  ఉల్లంఘించి మళ్ళీ నాటుసారా విక్రయిస్తూ పట్టుబడటంతో లక్ష  రూపాయలు జరిమానా విధించారు.

సకాలంలో జరిమానా చెల్లించకపోగా, గురు వారం రాయికల్  తహసీల్దార్ ముందు జగిత్యాల ఎక్సైజ్ సిఐ హాజరు పరిచారు. విచారించిన తహసీల్దార్ వెంకట నరస య్యకు జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ పరమేశ్వరరావు మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా   కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.