calender_icon.png 26 December, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి సీనియర్ అసిస్టెంట్‌కు జైలు

08-11-2024 12:47:24 AM

20 వేలు జరిమానా విధించిన కోర్టు

రాజేంద్రనగర్, నవంబర్ 7: లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ జిలగం వెంకటేశ్వర్‌రావు 2013లో ఓ ఫ్లాట్ మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అప్పట్లో కేసు నమోదు చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసుపూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి గురువారం నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.