51 మంది ఖైదీలకు విముక్తి
కాప్రా, ఆగస్టు 3 (విజయక్రాంతి): చరపల్లి కేంద్ర కారాగారంలో శనివారం ఖైదీల కోసం జైలు అదాలాత్ నిర్వహించి పలువురు ఖైదీలకు విముక్తి కలిగించారు. ఎల్బీనగర్ 6వ మెట్రోపాలిటిన్ జడ్జి జి.సాయిశరత్, 9వ అడిషనల్ మెట్రోపాలిటిన్ జడ్జి దిలీప్‌కుమార్, 4వ ఏజేసీజే, 4వ ఏఎంఎం జడ్జి నిష్కాపాత్రుడు ఆధ్వర్యంలో జైలు అదాలాత్ నిర్వహించి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14కేసులను పరిష్కరించి 12మంది ఖైదీలకు జైలు నుంచి విముక్తి కల్పించారు. అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలో 70మంది ఖైదీల కేసులను పరిష్కరించి 39మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వారు ఖైదీల సమస్యలు, బ్యారక్‌ల వివరాలు, భోజన వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కారాగారం సూపరిం టెండెంట్ సంతోష్‌కుమార్ రాయ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైల ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.