calender_icon.png 10 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై గురు దత్తాయనమఃరేపు దత్తాత్రేయ జయంతి

13-12-2024 12:00:00 AM

అహింస, కలుపుగోలుతనం, షరతులు లేని ప్రేమ, లోతైన పరివర్తన, సంపూర్ణ విముక్తి వంటి జీవన సూత్రాలకు మనం నివాళులర్పించే ప్రత్యేక సందర్భమే దత్త జయంతి. గొప్ప అవతారమై న శ్రీపాద శ్రీవల్లభ కాలం నుంచి నేటివరకు దత్తాత్రేయ స్వామి తన మూర్తీభవించిన ఆవిర్భావ రూపాల ద్వారా నిరంతరంగా వెలుగొందుతూనే ఉన్నాడు. నిజానికి ప్రస్తుత యుగం ముగిసే వరకు, కలియుగంలో, దత్తాత్రేయుడు ఈ భూమిపై సనాతన ధర్మ జ్వాలలను నిలిపేందుకు సంపూర్ణ జ్ఞానోదయ అవధూతల సమక్షంలో తనను తాను వ్యక్తమవుతూనే ఉంటాడు.

దత్తాత్రేయ భగవానుడు అన్నిటినీ చుట్టుముట్టే అద్భుత శక్తి.- సర్వోన్నత స్పృహ తాలూకు సత్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. మనం ఒక కొవ్వొత్తిని వెలిగించడానికి వేరొక కొవ్వొత్తిని ఉపయోగించినట్లే, దత్త దేవుడు కేవలం తన స్వంత ప్రకృతిలో కొంత భాగాన్ని విడదీశాడు. దానిని ఐదు తొడుగులు లేదా కోశాలలో నిక్షిప్తం చేస్తాడు. దత్త అవతారాలు అని పిలువబడే ఆ ఉత్కృష్టమైన జీవులు ఈ ప్రపంచంలో పదేపదే జన్మిస్తూనే ఉంటారు. దత్తాత్రేయుడు ప్రధానంగా ప్రకృతి స్వరూపం. గురువులు అందరూ ప్రకృతి నుంచి వచ్చిన వారే. ఆయన ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయనే పరమ చైత న్యం. శివుడు, విష్ణువు, బ్రహ్మ తనలో నిక్షిప్తమై ఉన్నారు. అంటే, ఆయన సర్వోన్నత స్పృహ, అందువల్ల అనిర్వచనీయుడు. 

మొదట్లో దత్త విగ్రహాలకు ఒకే ముఖం ఉండేది. చివరికి, ఒకే ముఖం ఉంటే, ప్రజలు మహావిష్ణువును పోలి ఉన్నాడని పొరబడే అవకాశం ఉంటుంది. కాబట్టి, మూడు ముఖాలతో త్రిమూర్తి స్వరూపంగా వెలిశాడు. ఆయనతోపాటు సాధారణంగా కనిపించే ఆవు, నాలుగు శునకాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, నాలుగు శునకాలు నాలుగు వేదాల (ఋగ్వేదం, యజు ర్వేదం, సామవేదం, అథర్వవేదం)ను సూచిస్తాయి.

ఆవు మనకు ఖగోళ సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి, స్వచ్ఛమైన శక్తిదాయక పదార్థాన్ని పొందేందుకు, ఉన్నత స్థానాలకు చేర్చేందుకు భూమిపైకి రావాల్సిందిగా ఋషి వశిష్టుడు ప్రార్థించినప్పుడు గోమాత వెలసింది.ఆవు మనకు తల్లిలా పోషణను అందిస్తుంది. కాబట్టి, ఈ జంతువుపట్ల మనకు పెద్ద బాధ్యత ఉంది. దానిని నిజంగా ‘జంతువు’ అనికూడా పిలువకూడదు. ఇది మానవునివలె అత్యంత ముఖ్యమైంది, ఇంకా ఎక్కువ కూడా. దత్తుని పక్కన ఆవు నిలబడి ఉండటం కూడా దాని ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నది. ఆవు ఖగోళ చిత్రాన్ని చూస్తే, దాని శరీరంలోని వివిధ భాగాలలో సకల దేవతలూ దర్శనమిస్తారు. కనుక, దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సమస్త ప్రకృతిని పూజించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. జై గురు దత్త!

 ‘మై దత్తాత్రేయ’ సౌజన్యంతో..