07-04-2025 02:08:11 PM
మద్నూర్, (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు రాజ్యాంగ పరిరక్షణ(Protection of the Constitution) పాదయాత్రలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర(Jai Bhim Jai Samvidhan Padayatra) కార్యక్రమం సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారస్ సాయిలు, సొసైటీ చైర్మెన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేతకాక ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దారాస్ సాయిలు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, హనుమంత్ యాదవ్, ముగ్డే వార్ సంగ్రామ్ పటేల్ హనుమాన్లు స్వామి, హన్మంత్ రావ్ దేశాయ్, విఠల్ గురూజీ కాంగ్రెస్ నాయకులు(Congress leaders) ప్రజలు పాల్గొన్నారు.