15-04-2025 01:31:53 AM
ఎల్బీనగర్‌లో మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో..
ఎల్బీనగర్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ మసీద్ గల్లీలో ’జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‘ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్బీనగర్ వార్డు కార్యాలయం సమీపంలోని పలు వీధుల్లో పాదయాత్ర చేపట్టి మహాత్మా గాంధీ ఆలోచనల కొనసాగింపు, డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షణ ఆవశ్యకతలను వివరించారు.
అనంతరం ఎల్బీనగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. హయత్ నగర్ చౌరస్తా, హన్మగల్ హయత్ నగర్, కొత్తపేట ఓల్ విలేజ్ లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మధు యా ష్కీ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూ లమాలలు వేసి నివాళులర్పించారు. హయ త్ నగర్ లోని అన్మగల్ లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ ఉపాధ్యక్షుడు సాయికుమార్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ .. ఈ దేశానికి స్వాతంత్రం అందించిన మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రమాదంలో పడిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులు పై ఉందన్నారు. రాజ్యాంగ రచనతో అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు కల్పించారని, కానీ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాలరాయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే చర్యలు చేపడుతుందని విమర్శించారు.
నూ తన వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చి రాజ్యాంగ ఉల్లంఘనలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మి ద్దెల జితేందర్, సీనియర్ నేత ముద్దగొని రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు లింగాల కిశోర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, కుట్ల నర్సింహ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, బుడ్డా సత్యనారాయణ, శశిధర్ రెడ్డి, చెన్న గోని రవీందర్, మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.