18-04-2025 12:07:56 AM
మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మల పల్లి నరసింహులు యాదవ్, మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.