30-04-2025 12:00:00 AM
కష్టకాలంలో పార్టీకి పనిచేసిన వారికే ప్రాధాన్యం ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమంను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయా ల్సిన అవసరం ఎంత ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆర్ జి గార్డెన్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ అన్న పదాన్ని అవమానపరుస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జై బాబు,జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్ర సమన్వయకర్త గద్దర్ కుమార్తె వెన్నెలమ్మ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఎవరు ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని, కుటుంబ పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఒక్కటేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను ఇంటింటికి చేరవెయ్యాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం సభ ప్రాంగణం నుంచి భగీరథ చౌరస్తా మీదుగా వివేకానంద చౌరస్తా మీదుగా రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు వారు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం భారీ ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో నాయకులు తదితరులు పాల్గొన్నారు.