calender_icon.png 18 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ను విజయవంతం చేయాలి

11-04-2025 01:17:44 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 14న నిర్వహించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి(Babasaheb Ambedkar Jayanti)ని లో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య కోరారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిన నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే మహత్తర కార్యక్రమానికి పట్టణంలోని 34 వార్డుల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.