07-04-2025 08:42:19 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ నీలయ్య కోరారు. ఏఐసీసీ పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు మండలంలోని శంకరపల్లి గ్రామ శివారులో మండలంలోని అన్ని గ్రామాల నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. దీనిని మండలంలో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, సీనియర్ నాయకులు కడారి జీవన్ కుమార్, మాజీ సర్పంచులు ఒడ్నాల కొమురయ్య, ఆసంపల్లి రాజయ్య, పెద్దపెల్లి చంద్రకళ, సుంకరి నంబయ్య తిరుపతి రెడ్డి, పెంచాల రాయలింగు కొట్టే సంపత్ కుమార్ పటేల్, ఆకుల అంజి, సంతోష్ బచ్చలి రాములు గుమాస మల్లేష్, మరాఠి శంకర్ లు పాల్గొన్నారు.