calender_icon.png 11 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూత్ పల్లిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ

04-04-2025 05:27:29 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ మండల అద్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిట్యాల మండల ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దమన్నారు. పార్టీ పిలుపు మేరకు  ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.