calender_icon.png 18 April, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

09-04-2025 09:27:46 PM

పాల్గొన్న ఏరియా ఐఎన్టియుసి నాయకులు..

కొత్తగూడెం (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌ను అవమానించినందుకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ప్రచారాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ నందు, బుధవారం యూత్ కాంగ్రెస్, ఐఎన్టియుసి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గౌతంపూర్ కాలనీ నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా  వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ నాయకులు పిట్ కార్యదర్హులు, బ్రాంచ్ కార్యదర్శిలు, సెంట్రల్ మెంబెర్స్, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కాలనీవాసులు పాల్గొన్నా రు.