calender_icon.png 11 April, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

04-04-2025 08:10:42 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజువాడి గ్రామంలో శుక్రవారం జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. గ్రామ వీధులలో రాజ్యాంగ పరిరక్షణ కోసం నినాదాలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అందరం పాటు పడదామని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జూకంటి వెంకట్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని శివాజీ, నాయకులు మోహన్ రెడ్డి, సంజీవులు, రాజేశ్వర్ రెడ్డి, సుధాకర్, మేకల రాజు, సంతోష్, లింగం, చిన్న సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.