02-04-2025 05:11:53 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): ఏసిసి టిపిసిసి నిర్దేశించిన, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ మండల కోఆర్డినేటర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ పొదేం వీరయ్య బుధవారం నియమించారు. కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం టౌన్ కన్వీనర్ గా మొహమ్మద్ గౌస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, తనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. డిసిసి అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదేం వీరయ్యకు, కొత్తగూడెం టీపీసీసీ సభ్యులు జేబీ శౌరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసారు.