calender_icon.png 27 April, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’

27-04-2025 12:00:00 AM

హాజరైన మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ప్రోగ్రాం  ఇన్‌చార్జి, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొ న్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తా  నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర్‌చారి, మాజీ ఎంపీపీ బుర్ర రేఖమహేందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ బింగి దాసుగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెదిరే సికెందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, ముత్యాల రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి, స్థానిక మండల పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ సర్పంచ్ ఏళ్ల బాల్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, భాస్కర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.