22-04-2025 10:52:27 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటి పెళ్లి, పెద్దంపేట, గ్రామలలో ఏఐసీసీ, టీపీసిసి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు ఎండి అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోని వీధులలో తిరుగుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ... మహాత్మాగాంధీ వల్ల స్వతంత్రం సిద్ధించిందని, అంబేద్కర్, రాజ్యాంగాన్ని రచించడం వల్ల అందరికీ సమాన హక్కులు లభించాయని వీరిని మనము ఎల్లప్పుడూ గౌరవించుకుందాం అని అన్నారు.
మూడు సూత్రాల మీద దేశం మొత్తంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమం లో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రబెల్లి విలాస్ రావు, పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు, మండల యూత్ నాయకుడు కటకం అశోక్, మండల ప్రధాన కార్యదర్శి శంకరయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లేతకారి రాజబాబు, మాజీ సర్పంచ్ కోట లక్ష్మి, సమ్మయ్య, యూత్ నాయకులు నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు ఎస్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.