02-04-2025 11:09:34 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఏఐసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిజ్ఞ బూని, ప్రతి గ్రామా, వార్డ్ , డివిజన్ లలో రిలే పద్దతిలో పాదయాత్ర జరగాలని, ఇట్టి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేసుకుంటూ, అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దస్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.