06-04-2025 09:17:04 PM
యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని వెంకటేష్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వార్డ్ అధ్యక్షులకు మాజీ కౌన్సిలర్లకు అనుబంధ సంఘ నాయకులకు సోమవారం మున్సిపాలిటీలోని 8 వార్డ్ లో గల ఇంద్రనగర్ నుండి ప్రారంభమయ్యే జై బాపు, జై భీమ్, జై సంవిధాను విజయవంతం చేయాలని ఆదివారం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని వెంకటేష్ మాట్లాడుతూ...... మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వార్డ్ అధ్యక్షులకు మాజీ కౌన్సిలర్లకు అనుబంధ సంఘ నాయకులకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కారిక్రమం సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాదయాత్రను విజయవంతం చేయగలరని కోరారు.