26-04-2025 01:09:34 AM
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపు మేరకు శుక్రవారం తుర్కయంజాల్ కూడలిలో తుర్క యంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మశివకుమార్, మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జై భాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ పీఠికపై తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ప్రమా ణం చేయించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకు మార్, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, కాకుమాను సునీల్, మర్రి మహేందర్‌రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి.హెచ్ భాస్కర చారి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవదాల్ వైస్ ప్రెసి డెంట్ మంకాల దాస్, కాంగ్రెస్ నాయకు లు భీమ్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్ ప్రజలు పాల్గొన్నారు.