28-03-2025 02:06:06 AM
జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్
కరీంనగర్, మార్చి 27 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కురుమల శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో కొత్తపల్లి మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా... పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కేంద్రా హోం శాఖా హోదాలో అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచేలా చేసిన వాఖ్యలకు నిరసనగా.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఏప్రిల్ 2వ తేదీ నుండి 10 వ తేదీ వరకు ‘జై బాపు, బై భీమ్, జై సంవిధాన్‘ ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని, ఆ కార్యక్రమంలో.. ప్రతీ కార్యకర్త పాల్గొని ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో... బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కొత్తపల్లి మండల అధ్యక్షులు బుర్ర బాబు గౌడ్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాంరెడ్డి రాం రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, కొత్తపల్లి మండల గ్రామాల అధ్యక్షులు, కొత్తపల్లి డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియార్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.