calender_icon.png 4 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణపల్లిలో జై బాపు జై భీమ్ కార్యక్రమం

03-04-2025 10:22:46 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి కాలోజీవాడి గ్రామాలలో గురువారం ప్రతినిధులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీధుల్లో నినాదాలతో తిరిగారు రాజ్యాంగం ఆవశ్యకతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు తామంతా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ రాజిరెడ్డి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని శివాజీ, నాయకులు తిరుపతి, రమేష్, నర్సింలు, లింగం, రాములు తదితరులు పాల్గొన్నారు.