calender_icon.png 20 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండ్ల పోచంపల్లిలో జై బాపు.. జై భీమ్ పాదయాత్ర

12-04-2025 12:00:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్ల పోచంపల్లి  మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన బాధ్య త ప్రతి పౌరుడు మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, ఓబీసీ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్, సురేందర్ ముదిరాజ్, కోమలత, బైరి ఈశ్వర్, బండారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.