calender_icon.png 18 April, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర

09-04-2025 10:49:19 PM

కాటారం (విజయక్రాంతి): ఏఐసీసీ, పీసీసీ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండలంలోని ఆదివారం పేట, గుమ్మల్లపల్లి, ఒడిపిలవంచ గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  కార్యక్రమంపై ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

బిజెపి నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల యూత్ అధ్యక్షులు చీమల సందీప్, చిటూరి మహేష్ గౌడ్, మాజీ సర్పంచులు చిర్ల తిరుపతి రెడ్డి, అంగజాల అశోక్ కుమార్, కోడి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, కొట్టే ప్రభాకర్, కొట్టే శ్రీహరి, కర్క ఉమాశంకర్, పసుల మొగిలి, శకుంతల తదితరులు పాల్గొన్నారు.