calender_icon.png 11 April, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

04-04-2025 06:09:33 PM

కాంగ్రెస్ నాయకుల ప్రచారం

కాటారం,(విజయక్రాంతి): జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. మండలంలోని మేడిపల్లి ( బస్వాపూర్ ), అంకుశాపూర్, కొత్తపల్లి గ్రామలలో ఏఐసీసీ, టీపీసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..మహాత్మాగాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని అన్నారు. ఈ మూడు సూత్రాల మీద యావత్ దేశంలో కార్యక్రమం జరుగుతుందని వివరించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, నాయకులు కుంభం రమేష్ రెడ్డి, కొట్టే ప్రభాకర్, నవీన్ రావు, బొంపల్లి రాజేందర్, కర్క ఉమాశంకర్, గడబోయిన దేవేందర్ యాదవ్, చీమల రాజు, అంగజాల అశోక్, తెప్పల దేవేందర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.