calender_icon.png 1 April, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని రక్షించేందుకే పాదయాత్ర

29-03-2025 09:21:36 PM

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి

దండేపల్లి,(విజయక్రాంతి): బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితిలో రాజ్యాంగాన్ని మారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ జిల్లా సంఘటన అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు, జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రక్షించేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈమెరకు దండేపల్లి మండల కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ అనే కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మార్చాలని బిజెపి చూస్తుందని ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు గ్రామాలలో పట్టణాలలో స్వతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ ఆశయాల అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం వారి ఫోటోలతో పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థ పై బిజెపి చేస్తున్నటువంటి కుట్రను ప్రజలకు తెలియజేస్తామని ప్రజాస్వామ్యం దేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛా హక్కులను కల్పించడం దేయంగా పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.