calender_icon.png 2 April, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనం భారతీయులం అనుకుంటే... కులమత భేదాలు వుండవు

28-03-2025 11:57:35 PM

రామగిరి,(విజయక్రాంతి): మనం భారతీయులం అనుకుంటే... కులమత భేదాలు  వుండవని, కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు దేశప్రజలు క్షమించరానివని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో  రాష్ట్ర ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి, రాష్ట్ర నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. శుక్రవారం రామగిరి మండల కేంద్రాల్లోని ఐఎన్టీయూసీ భవన్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్"అభియాన్ పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలతో దేశంలో అలజడి మొదలైందని, కేంద్రంలోని, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ ఎస్ కలిసి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీ పార్టీ దేశంలో రాజ్యాంగ మార్పుకు కుట్ర చేస్తున్నారని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని గ్రామాలలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతిరోజు రెండు గ్రామాలను పర్యటించి కాంగ్రెస్ పార్టీ జెండాలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరించాలన్నారు. రాజ్యాంగ రక్షణే మా ప్రధాన లక్ష్యమని, రాజ్యాంగం అంబేద్కర్  పై జరుగుతున్న కుట్రలను గ్రామ ప్రజలకు తెలుపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను,  కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రొడ్డ బాపన్న, యూత్ మండల అధ్యక్షుడు అవినాష్, ఐఎన్టీయూసీ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆరేళ్లి దేవక్కకొమురయ్యగౌడ్,  నాయకులు కాటం సత్యం, ముస్తాల శ్రీనువాస్,  గంట వెంకటరమణారెడ్డి, వనం రామచందర్ రావు, మైదం వరప్రసాద్,  తోటి చంద్రయ్య, కండె పోశం, ఉడుత శంకర్ యాదవ్, గిరవేన రాములు యాదవ్, కొడారి సదన్న యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.