కరీంనగర్, (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కోడిమ్యాల మండలంలోని పూడూర్ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్వే చేస్తున్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేస్తున్నారా అని కలెక్టర్ పరిశీలించారు.
సర్వే అయిన ప్రతి ఇంటి గోడ పైన ఖచ్చితంగా స్టిక్కర్ అంటించాలని తెలిపారు. పత్రంలో ఉన్న ప్రశ్నలను సరిగ్గా నింపుతున్నారా లేదా అని ఫామ్ ను తీసుకొని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఇంటిలోని మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఓపికతో ప్రతి కుటుంబం నుండి స్పష్టత కలిగిన సమాధానాలను సేకరించాలని, సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని వారికి అర్థం అయ్యే విధంగా తెలియజేయాలని సూచించారు. నింపిన షెడ్యూల్ ఫారంలోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు సుధన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.