calender_icon.png 23 April, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో జాగృతి సౌరభం

23-04-2025 12:43:08 AM

  1. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దూసుకుపోతున్నందున విద్యార్థుల హర్షం

ప్రిన్సిపాల్ అంబటి వినోద్ కుమార్

వనపర్తి, ఎప్రిల్ 22 (విజయక్రాంతి) : విద్యార్థుల కృషి, అందుకు సహకరించిన అధ్యాపక బృందం, సిబ్బంది సహకారంతో అచంచలమైన విజయం సాధించింది. జాగృతి కళాశాల పేరును పదిలం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ అంబటి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జాగృతి కళాశాల యాజమాన్యం మంగళవారం ఇంటర్ ఫలితాల అనంతరం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మేము అనుకున్న రీతిలో మా విధ్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన గర్వకారణంగా నిలిచారు. అందులో భాగంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపిసీ యం. చరిత లో 1000కి గాను 995 మార్కులు, కే. భవ్య 992, బి. స్వేత 989,డి.భవ్య శ్రీ 989,కే. మేఘన 988, జి. స్వేత 988,వై. నర్మద 988,ఆర్. ప్రవళిక 988 మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరం బైపీసి నందు ఎ. జ్ఞానేశ్వరి 1000 మార్కులకు గాను 988,ఎం. నిఖితాంజలి 981మార్కులు, సీఈసీ ద్వితీయ సంవత్సరం లో బి. సురేష్ 957,యు.సుమంత్ 951మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో విజయం సాధించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను పి. లావణ్య 468 మార్కులు, కే. అపూర్వ 467,ఎన్. వేణు ప్రసాద్ 467,సీ హెచ్. అర్జున్ 466,టి.పరుష రాముడు 464,బాల సిద్ధార్థ 464,లాల్ సింఘ్ 464,త్యాగరాజు 463,నాగ చైతన్య 463,వెంకట్రాముడు 462,ఇంద్ర 462,శ్రీజ 462,నారీస్ సాహితీ 461,రాంతేజ 461 సాధించి విజయకేతనం ఎగురవేయటం మంచి పరిణామం అని అన్నారు.

బైపీసి మొదటి సంవత్సరం లో 440 మార్కులకు గాను ఎన్. అర్చన 433,నస్రీన్ భాను 432,అనుశ్న 432,వైష్ణవి 432,మార్కులను సాధించారు. ఎంఈసీ, సీఈసీ లో ఎం. శ్రీలత 465,అశోక్ 461 మార్కులతో ఉమ్మడి జిల్లా టాపర్ల్ గా నిలవటం గర్వకారణంగా ఉందని తెలిపారు.

భవిష్యత్తులో కళాశాల ఉన్నతిని ఇంకా పెంపొందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం సభ్యులు భాస్కర్, శ్యామ్ కుమార్, సత్యనారాయణ లు విద్యార్థులకు పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు.