06-04-2025 12:13:30 AM
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశంలోని అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. దళితోద్యమ నేత, సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని అయన విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర నేతలు డా. లక్ష్య నాయుడు, రాకేష్ రెడ్డి, అజీమ్ బేగ్, శహబాజ్, ఎస్.ఎన్. రెడ్డి, మోనికా తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ 1935లో బాబు జగ్జీవన్ రామ్ ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి, అణగారిన ప్రజలకు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు సంక్షేమం కోసం అనేక ఉద్యమాలను నిర్వహించడాన్ని గుర్తు చేసారు.
భారత పార్లమెంట్ లో సామాజిక న్యాయ సూత్రాలను బలంగా నొక్కి చెప్పారని తెలిపారు. సామాజిక అణచివేత మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ పిలుపునిచ్చారు.