calender_icon.png 8 April, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్

06-04-2025 12:18:10 AM

తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి):  స్వాతంత్య్ర సమరయోధులు సామాజిక న్యాయానికై పరితపించిన గొప్ప నేత బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ రాష్ట్ర కన్వీనర్ ఐల వెంకన్న గౌడ్ అన్నారు.

ఈ మేరకు శనివారం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా  గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్, గౌడ సంఘాల సమన్వయకర్త ముద్ద గోని రామ్మోహన్ గౌడ్ తో కలిసి జగ్జీవన్ రామ్ గ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి , విశిష్టమైన పార్లమెంటేరియన్, ప్రజాస్వామ్యవాది, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన సమర్థ పరిపాలనాదక్షుడు అని కొనియాడారు.

భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా నిబద్ధత, అంకితభావంతో సేవలందించిన మహోన్నత నేతగా వారు అభివర్ణించారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని  పిలుపునిచ్చారు.