calender_icon.png 7 May, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం

05-04-2025 07:11:03 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

మంచిర్యాల (విజయక్రాంతి): బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలకు మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పోటు రవీందర్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈడి దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి కుల సంఘాల నాయకులతో కలిసి హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడు, దళితుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన మహనీయుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందే భారత మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారని, స్వాతంత్రం అనంతరం కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, భారత ఉప ప్రధానిగా వివిధ ఉన్నత పదవులలో దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.

వినూత్న సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశిష్ట కృషి చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమంలో ఆదర్శాలను ఆచరణలో చూపి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలని, వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.