06-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం భారతరత్న బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్ జీవితాన్ని అంకితం చేశాడని, భారతదేశ సామాజిక -రాజకీయ దృశ్యంపై చెరగని ముద్ర వేశాడని వారు డా.ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) అన్నారు. రక్షణ, వ్యవసాయం, కార్మిక సహా వివిధ మంత్రిత్వ శాఖలకు ఆయన చేసిన గణనీయమైన సహకారాన్ని వారు గుర్తు చేశారు.