calender_icon.png 6 April, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘ‌నంగా జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు

05-04-2025 08:41:08 PM

మునిపల్లి: డాక్టర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని బహుజన సంఘాల ఆధ్వర్యంలో మునిపల్లి మండలంలోని బుధేర చౌరస్తాలో,  మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యంలో జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిత్రప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంత‌రం బ‌హుజ‌న సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ.. తొలితరం దళితనేత, సంఘసంస్కర్త, స్వాతంత్రసమరయోధులు, పరిపాలనాదక్షుడు, హరితవిప్లవంకోసం కీలకభూమికను పోషించిన కృషీవలుడు, అణగారినవర్గాల సంక్షేమం కోసం అలుపెరుగనిపోరాటం చేసి సమసమాజ నిర్మాణానికి బాటలువేసి అఖండభారతావనికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, నర్సింలు,  సుధాకర్, బాగయ్య, రాజు, పాండు, నగేష్, జనార్దన్, దుర్గయ్య, భాస్కర్, చంద్రయ్య, రాములు, విజయ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.