05-04-2025 08:14:24 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, అణగారిన వర్గాలకు ఆయన ఎంతో మేలు చేశాడని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం హక్కులను వినియోగించుకొని ఉప ప్రధానిగా దేశానికి తినలేని సేవలు చేసిన ఘనత జగ్జీవన్ రావు దని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఎండి షమ్మీ, శంకర్ రెడ్డి, నిమ్మశంకర్, శేఖర్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.